బాజిరెడ్డి కుటుంబ సభ్యుల ప్రచారం

 – నవతెలంగాణ- జక్రాన్ పల్లి : మండల కేంద్రంలో ఇంటింటికి బాజిరెడ్డి కుటుంబ సభ్యుల ప్రచారం మంగళవారం కొనసాగింది. ప్రతి ఇంటికి వెళ్లి బాజిరెడ్డి గోవర్ధన్ కు ఓటు వేసి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. దళిత బంధు రైతుబంధు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాలను వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ భార్య వినోద, విపంచి జగన్, దీపిక అజయ్, శారద, ఎంపీపీ విమల రాజు , చక్రం పెళ్లి సర్పంచ్ చంద్రకళ బాలకిషన్, మనోహరాబాద్ సర్పంచ్ గంగాధర్  అర్గుల్ సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, మండల కోఆప్షన్ నెంబర్ బుల్టక్బర్ ఖాన్, గుండ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.