నవతెలంగాణ- నకిరేకల్: నకిరేకల్ మండలంలోని మండలపురం గ్రామంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ శనివారం సర్పంచ్ గుడుగుంట్ల లక్ష్మమ్మ శంభయ్య ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తో పాటు గ్రామంలో నిర్వహించిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తూ ఓట్లు వేయాలని అభ్యర్థించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్య కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తీగల మహేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఏర్పుల సైదులు, వార్డు సభ్యులు అవి రెండ్ల వీరయ్య, ఉపాధ్యక్షులు పొడి శెట్టి జానయ్య, నాయకులు పోలిశెట్టి వీరయ్య, తీగల కరుణాకర్, తీగల పిచ్చయ్య, యూత్ అధ్యక్షుడు తీగల నవీన్, కిషోర్, మాచర్ల వెంకటేష్ పాల్గొన్నారు.