న్యూఢిల్లీ : ప్రముఖ ఒటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ తన వినియోగదారులు ఇకపై పాస్‌వర్డ్‌ను ఇతరులతో పంచుకోవడానికి వీలు లేకుండా నిర్ణయం తీసుకుంది. భారత్‌లో పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని నిలిపివేసినట్లు వెల్లడించింది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. కుటుంబ సభ్యులతో కాకుండా ఇతరులతో పాస్‌వర్డ్ పంచుకుంటే అదనంగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.