నరమేథ వేట

మహాత్ముని బలికొన్న
నరహంతక ఆత్మ
భారత జాతిని నేడు
భయంకరంగా
వేటాడుతున్నది.
గుజరాత్‌ నరమేథం
రక్తపు టేర్ల తడి
ఇంక ఆరనే లేదు
మణిపూర్‌
మారణహౌమ జ్వాలలు
ఎగసెగసి పడుతున్నాయి
అటు ఆదివాసీలు
ఇటు ఆడవారు
గొంతు పెగలని గోడుతో
సమిధలవుతున్న కాలం
కాషాయమే
కాలకూట విషమై
దేశమంతటా విద్వేషం
బుసలు కొడుతున్నది
నాజీ నరహంతక హిట్లర్‌
20వ శతాబ్దపు మాట
ఈ నరమేథ విద్వేషం
21వ శతాబ్దపు వేట.
– కె. శాంతారావు,
సెల్‌:9959745723