
ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ మంచిది కాదని ప్రముఖ గైనకాలజి వైద్యురాలు అంకం భానుప్రియ అన్నారు. ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ సంయుక్త ఆద్వర్యంలో బుధవారం నిజామాబాదు మండలం గుండారం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ అంకం భానుప్రియ హాజరై విద్యార్థినిలనుద్దేశించి మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. మహిళలను రక్తహీనత సమస్య వేదిస్తుందని పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిల సందేహాలను డాక్టర్ భానుప్రియ నివృత్తి చేశారు. అనంతరం విద్యార్థినీలకు మాతృశ్రీ ఫౌండేషన్ ఆద్వర్యంలో సానిటరి ఫ్యాడ్స్, ఇంటిమేట్ వాష్ బాటిళ్ళు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అహల్య,తెలుగు ఉపాద్యాయులు కాసర్ల నరేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ అద్యక్షులు దర్మేందర్ పటేల్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు జిల్కర్ విజయానంద్, చింతల గంగాదాస్, తదితరులు పాల్గొన్నారు.