మెడికల్‌ సీట్ల అమ్మకం కేసు

– కాశ్మీర్‌లో ఈడీ సోదాలు
శ్రీనగర్‌ : పాకిస్థాన్‌లోని మెడికల్‌ సీట్లను జమ్ముకాశ్మీర్‌ విద్యార్థులకు విక్రయించారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో గురువారం ఈడీ సోదాలు నిర్వహించింది. హురియత్‌ నేతల నివాసాలతో పాటు మూడు ప్రదేశాల్లో సోదాలు జరిపినట్టు ఈడీ అధికారులు తెలిపారు. అనంతనాగ్‌లోని ఖాజీ యాసిర్‌ నివాసం, శ్రీనగర్‌లో జమ్ముకాశ్మీర్‌ సాల్వేషన్‌ మూమెంట్‌ చైర్మన్‌ జఫర్‌ భట్‌, అనంత్‌నాగ్‌లోని మట్టాన్‌ ప్రాంతంలో ఉన్న మహమ్మద్‌ ఇక్బాల్‌ ఖాజా నివాసంలో ఈ సోదాలు జరిపారు. సోదాల్లో ఇడి అధికారులతో పాటు జమ్ముకాశ్మీర్‌ పోలీసులు కూడా పాల్గొన్నారు. పాకిస్థాన్‌లోని మెడికల్‌ సీట్లను జమ్ముకాశ్మీర్‌ విద్యార్థులకు విక్రయించడంతో వచ్చిన సొమ్ము ఉగ్రవాద నిధులకు, ఉగ్రవాద మద్దతుకు ఉపయోగించినట్టు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.