నవతెలంగాణ-భిక్కనూర్ :
మండలంలోని టోల్ గేట్ వద్ద వాహనా తనిఖీలలో హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న రెండు కార్లలో 1,82,500, రూపాయలు మరో కారులో 60 వేల రూపాయలు లభించాయి. ఎలాంటి పత్రాలు లేని కారణంగా నగదును స్వాధీనం చేసుకొని ఎఫ్ ఎస్ టి టీంకు అప్పగించినట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు. ఈ తనిఖీలలో పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.