కేసీఆర్ కు మద్దతుగా కుల సంఘాలు

నవతెలంగాణ- రామారెడ్డి :  కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్నoదున  కుల సంఘాలు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నాయి. కామారెడ్డిలో శుక్రవారం మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన మ్యాదరి, నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ లో చేరి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, నాయకులు బుచ్చిరెడ్డి, రవీందర్ రెడ్డి, స్వామి గౌడ్, బాలరాజ్, బట్టు సంతోష్, రాజయ్య తదితరులు ఉన్నారు.