పండగకు కుల సంఘాలు సహకరించాలి

నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో నిర్వహించనున్న ఊరడమ్మ పండగకు అన్ని కుల సంఘాలు సహకరించాలని పట్టణ సర్పంచ్ తునికి వేణు తెలిపారు. గురువారం గ్రామ సచివాలయంలో కుల సంఘాలతో సమావేశం నిర్వహించి పలు సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్, మాజీ సర్పంచ్ నాగభూషణం గౌడ్, నాయకులు లింబాద్రి, మోహన్ రెడ్డి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.