నేడు జరిగే ప్రజాసంఘాల ఐక్యవేదిక బస్సుయాత్ర సభను జయప్రదం చేయండి

నవతెలంగాణ – కంటేశ్వర్
నేడు అనగా శనివారం జరిగే ప్రజాసంఘాల ఐక్య వేదిక బస్సు యాత్రను సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం సిపిఎం జిల్లా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, కట్టిన డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ పోరాడుతా ఉంది. ఈ ప్రభుత్వం ఇంటి స్థలాన్ని పేదలకు కేటాయించకుండా పాలకవర్గ పార్టీల అనుకూలురు ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తా ఉంటే చోద్యం చూస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రజాసంఘాల ఐక్యవేదిక కదిలింది. రాష్ట్రవ్యాప్తంగా 72 కేంద్రాలలో వేసుకున్న పేదల గుడిసెలను సందర్శిస్తూ, వారితో మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో సభలు ఏర్పాటు చేస్తూ రేపు 24వ తేదీన నిజాంబాద్ కు వస్తున్నారు. వారికి ఘన స్వాగతం పలికి స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సభను ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో జరుపుతున్నాం. ఈ సభకు పేదలు, గుడిసెవాసులు, అత్యధికంగా తరలి హాజరై జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ ప్రజాసంఘాల పోరాట వేదికలు సిఐటియు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, కెవిపిఎస్, ప్రజానాట్యమండలి ఉమ్మడి పిలుపునిస్తున్నాయి. ఈ మేరకు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, పెద్ది వెంకట్రాములు జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం,తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూరి, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్, గంగాధర్, అనిత తదితరులు పిలుపునిచ్చారు.