– బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రదాన
హైదరాబాద్ : 2023 వివిధ వ్యాపార రంగాల్లో సేవలు అందిస్తున్న ఎంతో మంది వ్యక్తులను, సంస్థలను గుర్తించి హైబిజ్ టివి మొదటి ఎడిషన్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023ను ప్రదానం చేసింది. హైదరాబాద్‌లోని నోవొటెల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత కెఐ వరప్రసాద్ రెడ్డి, శాంతా బయోటెక్ ఛైర్మన్, టిఎస్‌ఐఐసి వైస్ ఛైర్మన్ నర్సింహా రెడ్డి హాజరయ్యారు. లెజెండ్స్ కేటగిరీలో భారతీ సిమెంట్స్‌కు చెందిన ఎం రవీందర్ రెడ్డి, బ్రాండ్ ఇండియా ఫార్మా యొక్క క్రూసేడర్ అండ్ ప్రపంచ ప్యాకేజింగ్ యొక్క గ్లోబల్ అంబాసిడర్ చక్రవర్తి ఎవిపిఎస్, మానేపల్లి జ్యువెలర్స్ మానేపల్లి రామారావు, ఆర్క్ గ్రూప్ గుమ్మి రామ్ రెడ్డి తదితరులకు అవార్డులు దక్కాయి. ”వ్యాపారం అనేది సంపదను పెంచుకోవడం మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని వరప్రసాద్ రెడ్డి అన్నారు. ఎన్ని అవరోధాలు వచ్చిన్నప్పటికీ, వాటిని ఎదు ర్కొని నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైబిజ్‌టివి ఎండి ఎం రాజ్‌గోపాల్ పాల్గొని.. అవార్డు గ్రహీతలను ప్రశంసించారు.
వేడుకగా హైబిజ్ టివి
1:10 am