
తెలంగాణ రాష్ట్రం ఐటి, పురపాలక శాఖమంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలను సోమవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉన్నతమైన పదవులు అధిష్టించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న , హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస, వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన రజని, వాల సుప్రజా నవీన్ రావు, బొల్లం శ్రీలత, బొజ్జ హరీష్, పేరుక భాగ్యరెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, ఐలేని శంకర్ రెడ్డి,కోఆప్షన్ సభ్యులు యండి అయూబ్, బీఅర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు యండి అన్వర్, నియోజక వర్గం అధ్యక్షులు గందె చిరంజీవి, మేకల వికాస్ తదితరులు పాల్గొన్నారు.