నవతెలంగాణ-నేరేడ్ మెట్
బీజేపీ అల్వాల్ సర్కిల్ సీనియర్ నాయకుడు మల్లికార్జున గౌడ్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. బీజేపీ నాయకులు, కార్యకర్తలు , శ్రేయోభిలాషుల ఆనందోత్సాహాల నడుమ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మల్కాజిగిరి నియోజకవర్గం కన్వీనర్ సదానంద గౌడ్, కార్పొరేటర్ శ్రావణ్ కుమార్, సీనియర్ నాయకులు మల్లికార్జున్, దండగుల వెంకటేష్, శ్రీనివాస్, అజిత్ సాయి తదితరులు హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్ రెడ్డి, శ్రీశైలం, భాను, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు