జోష్‌గా మహిళ దినోత్సవ వేడుకలు

– ఎస్‌బీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ నిర్వహణ
నవతెలంగాణ-హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (హైదరాబాద్‌ సర్కిల్‌) ఫుల్‌ జోష్‌గా మహిళ దినోత్సవాన్ని నిర్వహించింది. ఆదివారం కోటిలోని లోకల్‌ హెడ్‌ ఆఫీసులో నిర్వహించిన ఈ వేడుకలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 500 పైగా మహిళ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, క్విజ్‌, చారిటీ కార్యక్రమాలు నిర్వహించారు. చురుకైన, మెరిట్‌ కలిగిన ఆఫీసర్ల పిల్లలకు సహా మెరిట్‌ కలిగిన పేద బాలికలను సత్కరించడంతో పాటు వారికి ఆర్థికంగా సాయాన్ని అందించారు. పలు పోటీల్లో పొల్గొని గెలుపొందిన వారికి బహుమతు లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎస్‌బిఐ లేడిస్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ నుపూర్‌ జింగ్రన్‌, హైకోర్టు న్యాయమూర్తి చిలకూర్‌ సుమలత, ఎస్‌బిఐ ఎల్‌హెచ్‌ఒ నెట్‌వర్క్‌ 1 జనరల్‌ మేనేజర్‌ మంజూ శర్మ, సిజిఎం అమిత్‌ జింగ్రాన్‌, సిఎఒ జిఎం శేఖర్‌ ఎల్‌ తదితరులు హాజరై ప్రసంగించారు. వ్యక్తలు తమ స్పూర్తిదాయక ఆలోచనలను పంచుకున్నారు.