
మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వద్ద బీఎస్పీ అద్వర్యంలో రిజర్వేషన్ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. జూలై 26,1902న బ్రాహ్మణేతర ప్రజలకు రిజర్వేషన్ ఉత్తర్వుల జారీ చేసిన సందర్భంగా చత్రపతి షాహుజీ మహారాజ్ చిత్రపటానికి బీఎస్పీ నాయకులు పూలమాలలు వేసి నివాలర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పెద్దోల్ల శ్రీనివాస్ యాదవ్, మాతంగి తిరుపతి, లింగాల శ్రీనివాస్, బోనగిరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.