అమ్సన్ పల్లి లో ఊరుర చెరువుల సంబరాలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఇందల్ వాయి మండలంలోని అమ్సన్ పల్లి గ్రామంలో బీఅర్ఎస్ సినియర్ నాయకులు తటిపాముల శ్రీనివాస్ గుప్త,ఉప సర్పంచ్ రాజేశ్వర్ లో అధ్వర్యంలో ఊరుర చెరువుల పండుగ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళలు వందల సంఖ్యలో చేరుకుని డప్పు వాయిద్యాలతో బోనాలను ఉరెగింపుగా చెరువుల వద్దకు తిసుకేల్లి సంబరాలు జరుపుకున్నారు. పేద్ద ఎత్తున మహిళలు పాల్గోనడంతో నాయకులు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.