శతవసంతాల అచ్యుతానందన్‌

Centenary Achuthanandan– వీఎస్‌ జీవిత కథ ఎ సెంచరీ ఆఫ్‌ స్ట్రగుల్‌ : ఆవిష్కరించిన కేరళ సీఎం
తిరువనంతపురం : ప్రముఖ కమ్యూనిస్టు నేత, మాజీ ముఖ్యమంత్రి విఎస్‌ అచ్యుతానందన్‌ 100వ జన్మదినం సందర్భంగా తిరువనంతపు రంలోని అయ్యంకాళి హాలులో ఆయన జీవిత కథను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆవిష్కరించారు. దర్శకుడు షాజీ ఎన్‌ కరుణ్‌ పుస్తకాన్ని అందుకున్నారు. చింతా పబ్లిషర్స్‌ ప్రచురించిన పుస్తకానికి రచయిత కె.వి.సుధాకరన్‌. ఈ సందర్భంగా సీఎం పినరయి విజయన్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రతో ముడిపడివున్న విఎస్‌ జీవితాన్ని ఈ పుస్తకంలో చక్కగా వివరించారని తెలిపారు. గతంలో వచ్చిన పుస్తకాలు అలా లేవని, పార్టీ నుంచి విడదీసి విఎస్‌ను ప్రత్యేకంగా చూపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఎనిమిది దశాబ్దాలుగా విఎస్‌ ప్రజల పక్షాన చురుగ్గా పనిచేశారని తెలిపారు. 96 ఏండ్ల వయసులో అనుకోకుండా కొన్ని శారీరక సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు.