– ఉమ్మడి జిల్లాలో 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు
– మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఉత్సవాలపై సమీక్షలు
ఆరు దశాబ్దాల కల నెరవేరింది. వందలాది మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. కలెక్టర్లు మొదలుకొని మంత్రుల దాకా ఉత్సవాల విజయవంతం పై దృష్టి సారించారు. ఇప్పటివరకు ఉత్సవాలకు సంబంధించిన నిధులు ఏమీ రాలేదు. అయినా అధికారులు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో జరిగిన అభివృద్ధిని శకటాలుగా ప్రదర్శించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే సంక్షేమ పథకాలు భారీ ప్రాజెక్టులు కులవృత్తులకు సంబంధించిన శకటాలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంచారు. కలెక్టర్లు వివిధ రంగాలకు చెందిన జిల్లా అధికారులు సమీక్షలు నిర్వహించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు సుదీర్ఘంగా పోరాటాలు చేశారు. పోరాటాల ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం జరిగి పది సంవత్సరాలైయ్యింది.ఈ సందర్భంగా ప్రభుత్వం దశాబ్దాల ఉత్సవాలు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే రాష్ట్రం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల విషయంలోనే ప్రజలు అనేక ప్రశ్నలు వస్తున్నాయి.
నవ తెలంగాణ-
మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రస్తుతం ఎవరి నోట విన్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడుతున్నారు.ఇప్పటికే ప్రభుత్వ శాఖలకు నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసేది. అయితే ఇప్పటికీ ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు నిధులు రాలేదు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పనులు నిర్వహిస్తున్నారు. కలెక్టర్,ఎస్పీ కార్యాలయాల సుందరీకరణ పట్టణానికి ఇరువైపులా ఉన్న హరితహారం మొక్కలు వీధిలైట్లను వేశారు. పంచాయతీ రాజ్ రోడ్లు, భవనాలు, మున్సిపాలిటీ, రెవెన్యూ హాస్పిటల్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ ఒంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై నిమగమై ఉన్నారు.సంతృప్తికరమైన పనులు కొన్ని నిర్వహించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆశించిన స్థాయిలో అభివద్ధి జరిగే లేదనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాల అభివృద్ధిఎలా జరుగుతుందో ప్రజల దష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఉంది. సందర్భంగా అనేక రంగాలకు చెందిన కార్యక్రమాలు ఉంటాయి. వచ్చేది ఎన్నికల సంవత్సరం ప్రజలకు ప్రభుత్వం ఎటువంటి పథకాలను అందిస్తుందో చెప్పాల్సి ఉంది. సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ప్రచారంలో పెట్టనున్నది.గతంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. పండుగ జరిగిన తర్వాత నిధుల మాట ఎత్తలేదు. ఇప్పుడు సర్పంచులు మండల అధికారులు దశాబ్ద ఉత్సవాలపై ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలను నిలపీయకుండా ప్రతి ఒక్కటి అమలు చేయాలని పలు పార్టీలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
నిధులు ఇవ్వకుండా..
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటుంది. అయితే ప్రభుత్వ శాఖలకు నిధులు ఇవ్వకుండా ఎలా ప్రదర్శించాలని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటివరకు జిల్లా కార్యాలయాలు మండల కార్యాలయాల్లో కనీసం కాంటెంజెన్సీ నిధులు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఎలా చేయాలని తలలు పట్టుకుంటున్నారు. ఆరు నెలలుగా బడ్జెట్ లేదు. తెల్ల కాగితాలు గుండుసూదులు సైతం సొంతంగా కొనుగోలు చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో దశాబ్ ఉత్సవాలు ఎలా జరపాలని ఉద్యోగులు మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులు ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేస్తే 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు సజావుగా నిర్వహిస్తారు. అభివృద్ధి కోసం మున్సిపాలిటీ నిధులు ఖర్చు చేయాలని ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల దృష్ట్యా అవి ఖర్చు చేయడం లేదు.
మంత్రులు, ఎమ్మెల్యేల హడావుడి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు హడావుడి చేస్తున్నారు. నిధులు లేకుండా హడావిడి చేసిన ఉపయోగం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి ఆవిర్భావ దినోత్సవానికి నిధులు కేటాయించాలని కోరుతున్నాం. 65 ఏండ్ల పోరాటాన్ని నెమరు వేసుకుంటూ ముందుకు కలగాలని పట్టుదలతో ఉన్నారు.
శతాబ్ది ఉత్సవాలపై పెదవి విరుపు
శతాబ్దిత్వాలపై పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు పెదవి విరస్తున్నారు. వాస్తవం ఏర్పడిన తర్వాత ఏమి సాధించారని దశాబ్ది ఉత్సవాలు.జరుపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఉత్సవాలు ఎలా జరుపుతారని కొంత మంది మండిపడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఏర్పడిన తర్వాత వెంటనే దళితులకు సాగుభూమి మూడెకరాలకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు 600 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు.రెండోసారి అధికారంలోకి రాకముందు ప్రచారంలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి లక్ష రూపాయల రుణమాఫీ లాంటివి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఏవీ అమలు చేయకుండా దశాబ్ది ఉత్సవాల పేరుతో రాజకీయం చేస్తున్నారని కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.