మల్లయోధులకు న్యాయం చేయాలని ప్రజాసంఘాల ధర్నా

మహబూబ్‌ నగర్‌ : మల్లన్న యోధులకు న్యాయం చేయాలని ప్రజాసంఘాల బుధవారం సంయుక్త కిసాన్‌ మోర్చా ఎస్‌ కే యం పిలుపుమేరకు తెలంగాణ చౌరస్తాలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన మహిళ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మేధావి సంఘం నాయకులు మాట్లాడుతూ మహిళా మల్లయోధులపై లైంగిక దాడికి పాల్పడిన బ్రిజ్‌ భూషణ్‌ బీజేపీ ఎంపీ ని తక్షణమే అరెస్ట్‌ చేసి శిక్షించాలని,రెజ్లర్ల అధ్యక్ష బాధ్యతలను తొలగిం చాలని, ఎంపీ పదవి నుంచి తొలగించాలని, డిమాండ్‌ చేస్తూ ప్రజాసంఘాల నాయకులు సిఐటియు, ఏఐటీ యూసీ, ఐఎఫ్‌టియు, పాలమూరు అధ్యయన వేదిక, చైతన్య మహిళా సంఘం, ఐద్వా, టిపిఎస్‌కె, తెలంగాణ సాహితీ, టిఎఫ్‌టియూ, బిఎస్‌పి, జెఎంఐవి. పాలమూరు లేబర్‌ సంఘం, తదితర సంఘాలు భారీ ఎత్తున నిరసనలు, తెలంగాణ చౌరస్తా నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నాయ కులు వల్లభపురం జనార్ధన,ఖాజా మినుద్దీన్‌, నల్లవెల్లి కురుమూర్తి సి. వెంకటేష్‌,ఎం రామ్మోహన్‌, వి. కురుమూర్తి, తిమ్మప్ప శ్రీదేవి పద్మ మోహన్‌, తిరుమలరెడ్డి, గోపాల్‌ విజరు కుమార్‌, కురుమయ్య, పాల్గొన్నారు. మల్లయోధులకు న్యాయం చేయాలని ప్రజాసంఘాల ధర్నా

Spread the love