దళిత జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి

నవతెలంగాణ- శంకరపట్నం
కేంద్ర,రాష్ట్ర, ప్రభుత్వాలు దళిత, గిరిజన జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కట్కూరి మల్లేశం పిలుపునిచ్చారు. బుధవారం శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రైవేటు గార్డెన్లో విలేకరుల సమావేశం జిల్లా అధ్యక్షుడు మైలవరం ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మల్లేశం మాట్లాడుతూ, దళిత, గిరిజన జర్నలిస్టుల సంక్షేమానికి అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. దళిత జర్నలిస్టులకు అక్రిడేషన్ కమిటీలో కమిటీ మెంబర్ గా స్థానం కల్పించాలన్నారు. రోజురోజుకు దళిత జర్నలిస్టులపై
దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఈనెల 13న శంకరపట్నం మండలంలో మండల స్థాయి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ,తెలిపారు. ఈ సమావేశానికి దళిత, గిరిజన జర్నలిస్టులంతా హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు మైలవరం ప్రేమ్ కుమార్, సదానందం, శంకర్, దేవునూరి రవీందర్, దామెర సతీష్, గాజుల స్వామి, ఎలకపల్లి సుధీర్, బుర్ల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.