ధరలను నియంత్రించలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్
నవతెలంగాణ- కంటేశ్వర్
ధరలను నియంత్రించలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దర్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో అధిక ధరలను నియంత్రించాలని, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ప్రదర్శన నిర్వహించి ఎన్టీఆర్ చౌరస్తాలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆకలి హారం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిది ఏళ్లలో పదుల సంఖ్యలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి నిత్యవసర వస్తువులపై కూడా భారం వేసే విధానాలకు పాల్పడడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేసుకోలేని స్థితిలోకి నెట్టివేయబడ్డారని అన్నారు, నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు సమగ్రమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు, ధరలను నియంత్రించలేని ప్రజా సమస్యలు పట్టని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్ మల్యాల గోవర్ధన్, నగర కార్యదర్శి పెద్ది సూరి, నగర కమిటీ సభ్యులు కటారి రాములు,పి మహేష్, ధ్యారంగులా కృష్ణ, నల్వాల నరసయ్య , మునీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.