సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు: కేంద్ర ఎన్నికల పోలీస్‌ పరిశీలకులు

నవతెలంగాణ-వరంగల్‌
సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల పోలీస్‌ పరిశీలకులు రాజేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. సోమ వారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయం లో వరంగల్‌ (తూర్పు)-106 నియోజక వర్గ రిట ర్నింగ్‌ అధికారి, జిడబ్ల్యూఎంసీ కమీషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ భాషా తో నియోజకవర్గంలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో చేపట్టిన కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించారు.అంతకుముందు ప్రధాన కార్యాలయానికి చేరుకున్న పోలీసు పరిశీలకులకు ఆర్‌. ఓ .స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తూర్పు రిటర్నింగ్‌ అధికారి పోలింగ్‌ కేంద్రాల గురిం చి వివరిస్తూ వరంగల్‌ (తూర్పు) నియోజకవర్గం లో ఏర్పాటుచేసిన 230 పోలింగ్‌ కేంద్రాలలో ఎన్ని కల సంఘం ఆదేశాల మేరకు 25 శాతం పోలింగ్‌ కేంద్రాలు అనగా 57 సమస్యాత్మక (క్రిటికల్‌) పోలిం గ్‌ కేంద్రాలుగా ఇప్పటికే గుర్తించి ఈ నెల 30న ఎన్ని కల పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నా రు.ఈ సందర్భంగా పోలీస్‌ పరిశీలకులు మాట్లాడు తూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గత నేర చరి త్ర,రౌడీ షీట్‌ ల చరిత్ర పై సమగ్ర సమాచారం సేక రించాలని, రాజకీయ పార్టీల సున్నీతత్వం, గుర్తించ బడిన పోలింగ్‌ కేంద్రాల ప్రాంతాల్లో, మిశ్రమ సంస్కతి ఉన్న ప్రాంతాలు ఏమైనా ఉన్నాయో గుర్తించాలని, వాహనాలు సులువుగా తిరగడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని, గుడుంబా, మద్యం మత్తు పదార్థాల ప్రభావం ఆయా ప్రాంతా ల్లో ఏమేరకు ఉంటుందో అవగాహన కలిగి ఉండా లని, అదనపు బలగాల మోహరింపుపై ప్రత్యేక కార్యాచరణ (ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌) ఉండాలని, ఆయా పోలింగ్‌ కేంద్రాలలో లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌ ఉండాలని, రోజువారీ కార్యకలాపాలపై లా %డ% ఆర్డర్‌ ప్రకారంగా ఎలాంటి చర్యలు చేపడుతు న్నారని, ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు బోనా ల కిషన్‌ ను అడిగి తెలుసుకున్నా రు, ప్రస్తు తం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నిర్వహిస్తున్న ర్యాలీలు, ప్రచారం పై పోలీస్‌ నిఘా, ఫ్లయింగ్‌ స్క్వాడ్ల నిర్వహణ, వీడియో సర్వేలేన్స్‌ బందాల పనితీరుపై సమీక్షించారు.ఈ సందర్భం గా ఏ సీ పీ మాట్లాడుతూ ఇప్పటివరకు లా,ఆర్డర్‌ పరిధి లో ఎం.సి.సి.ఉల్లంఘన కింద 11 కేసులు నమోదు చేయడం జరిగిందని, నిబంధనలు అతిక్రమించిన ప్రధాన పార్టీ అభ్యర్థుల మీద కుడా కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.