బిసిల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రేమ లేదు

నవతెలంగాణ- వీర్నపల్లి 
బిసిల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రేమ లేదని బిఎస్పి పార్టి జిల్లా అధ్యక్షులు వర్ద వెల్లి స్వామి గౌడ్ అన్నారు.వీర్నపల్లి మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశన్ని శుక్రవారం ఏర్పాటు చేసి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వర్ధావెల్లి స్వామి గౌడ్ బహుజన సమాజ్ పార్టీని రానున్న అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర రథసారథి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించినట్లుగా బి.సిలకు 60-70 సీట్లు కేటాయించారు అన్నారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోని రెండు నియోజవర్గాలు సిరిసిల్ల, వేములవాడ నియోజక వర్గాల్లో బలమైన బి.సి అభ్యర్థులను బరిలో నిలబెడుతున్నట్లు ప్రకటించారని తెలిపారు. రాష్ట్రం , కేంద్రం ప్రభుత్వాలకు కూడా బి.సి మీద ప్రేమ లేదన్నారు కేవలం బి. సి.లను కేవలం ఎన్నికలల్లో ఒట్లేసే యంత్రాల్లనే చూస్తున్నారన్నారు. 18 న జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశనికి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టి మండల అధ్యక్షుడు గజ్జెల ప్రశాంత్, మండల ఉపాధ్యక్షులు కోల్లపాక అనిల్, పాటి శ్రీనివాస్, మండేపల్లి రవి, తుడుం తరుణ్ , తదితరులు పాల్గొన్నారు.