యూరియా బస్తాలను రైతులకు అందజేసిన సొసైటీ చైర్మన్

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో రైతన్నలకు పొగాకు, శనగ, పంటల కోసం యూరియా అత్యవసరం కావడంతో నీల సింగిల్ విండో చైర్మన్ ఇమామ్ బేగ్ మార్క్ పెడ్ అధికారులతో సంప్రదించి రెండు లారీలలో యూరియాను తెప్పించి రైతులకు అందజేశారు. సమయానికి గ్రామానికి యూరియా తీసుకువచ్చిన చైర్మన్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.