నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాన్లు స్వగృహంలో ఎమ్మార్వో ధన్వల్, ఎస్సై యాదగిరి గౌడ్ లను శాలువలతో మంగళవారం సన్మానించారు. గ్రామానికి విచ్చేసిన సందర్భంగా మర్యాదపూర్వకంగా సత్కరించి గ్రామంలోని పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మోహన్, వీఆర్వోలు నరేష్, భూమేష్, గణేష్ ఉన్నారు.