మండలంలో ఘణంగా చాకలీ ఐలమ్మ వర్దంతి వేడుకలు

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని కేంద్రంతో పాటు పలు గ్రామాలలో చాకలి ఐలమ్మ వర్దంతి వేడుకలు ఘణంగా నిర్వహించారని మండల చాకలి ఐలమ్మ సంఘం నాయకుడు కృష్ణ తెలిపారు. ఈ సంధర్భంగా జుక్కల్ కేంద్రంలో చాకలి సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి, ఆమే చేసిన పోరాటాలను సంఘం నాయకుడు  కృష్ణ వివరించారు. అదేవిధంగా మహమ్మదాబాద్ లో గ్రామ చాకలి సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి నివాళ్లు అర్పించి వర్దంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బి. రాములు , విండో చైర్మేన్ శివానంద్, మార్కేట్ కమిటి మాజీ చైర్మేన్ సాయాగౌడ్, బీఆర్ఎస్ సీనీయర్ నాయకుడు నీలుపటేల్, కాంగ్రేస్ నాయకడు దాదారావ్ పటేల్, చాకలి సంఘం సబ్యులు మారుతి, గంగారాం , సంతోష్, బాలాజీ, సుభాష్, యేగేష్ తదితరులు పాల్గోన్నారు.