నవతెలంగాణ-నడికుడ
మండలంలోని రాయపర్తి, పులిగిల్ల గ్రామాలలోని కాంగ్రెస్, బీజేపీ పార్టీ నుండి పలువురు నాయకులు పర కాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చే రారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత 60ఏళ్ల కాలంలో చేసింది ఏమిలేదని, ఆనాడు ఆపార్టీలు చేయని అభివృద్ధి, ప్రజలకు సంక్షేమ పథకాలు గడిచిన పదేళ్లకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యం లో చేసామని అన్నారు. పార్టీ లో చేరిన వారు అల్లం శ్రీని వాస్, రాసమల్ల కొమురయ్య, కోరేం శ్రీనివాస్ రెడ్డి తది తరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థా నిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యక ర్తలు తదితరులు ఉన్నారు.
వలస పక్షులవలే రేవూరి …
గీసుగొండ : కాలానికి అనుగుణంగా పక్షులు వల స పోయినట్టు పార్టీలు మారే రేవూరిని ప్రజలు నమ్మే ప రిస్థితి లేదని రేవూరినిను ఉద్దేశించి చల్లా ధర్మారెడ్డి ఎద్దే వా చేశారు. వరంగల్ మహానగర పరిధిలోని 16 15 డి విజన్ ఎమ్మెల్యే చల్లా ప్రచారంలో భాగంగా ఆడపడు చులు కోలాటలతో చల్లా ధర్మారెడ్డికి ఆహ్వానం పలికారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూతెలంగాణ ద్రోహులు కాంగ్రెస్ బిజెపి పార్టీలు మన రాష్ట్రంలో గల్లం తవ్వడం ఖాయమని ఎమ్మెల్యే చల్లా అన్నారు, ముచ్చట గా మూడోసారి ఆశీర్వదించి గెలిపిస్తే రాష్ట్రంలోనే మన నియోజకవర్గాన్ని మొదటిస్థానంలో నిలుపుతారని అన్నా రు. గ్రామాల్లో తిరుగుతున్న బీజేపీ కాంగ్రెస్ నాయకుల ను తెలంగాణ రాష్ట్రానికి ఆ పార్టీలు చేసిన మేలు ఏంటో అడగండన్నారు. 17హామీలతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. 24గంటల కరెంటు ఇచ్చే తెలం గాణ ప్రభుత్వం కావాలా లేక మూడు గంటలు ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలో ప్రజలే ఆలోచించాలని కోరారు. రేవూరి తన స్వార్ధ రాజకీయాల కోసం పార్టీలు మారుతున్నారని అన్నారు, మరోసారి కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే చల్లా ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లానాయకులు సుం కరి శివ, మండల పార్టీ అధ్యక్షుడు రాజకుమార్, జెడ్పిటి సి పోలీస్ ధర్మారావు, మండల నాయకులు రడం భరత్, ఏనుమామూల మార్కెట్ మాజీ చైర్మన్ చింతంస దానం దం, మండల యూత్ అధ్యక్షులు శిరీసే శ్రీకాంత్, దళిత బంధు చైర్మన్ కోటప్రమోద్, మండల మహిళా నా యకు లు కొండ రాధ, రేణుక, సర్పంచులు జైపాల్ రెడ్డి, మల్లా రెడ్డి, చిన్ని, అంకతి నా గశ్వరరావు, రాజు, గోలి రా జయ్య తదితరులు పాల్గొన్నారు.