నవ తెలంగాణ-రెంజల్: ఈనెల 11న చలో హైదరాబాద్ విశ్వరూపం మహాసభకు తరలిరావాలని నీల గ్రామంలో బుధవారం పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది, ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోశెట్టి మాట్లాడుతూ శీతాకాల సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు 11న హైదరాబాద్ లోని పేరెడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న విశ్వరూప మహాసభకు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేయడం జరిగిందని, ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బండారి రాజేందర్, బండారి సాయిలు, బండారి రవి, బండారి ఎల్లప్ప, బండారి మోహన్, బండారి శ్రీనివాస్, బండారి లాలు, బండారి నరసన్న, బండారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.