వీవోఏల సమస్యలు పరిష్కరించాలని ఛలో హైదరాబాద్‌

సీఐటీయూ మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు
నవతెలంగాణ-నెల్లికుదురు
వివిధ గ్రామాలలో వీవోఏలుగా విధులు నిర్వహిస్తున్న వారి సమస్యలను తక్ష ణమే పరిష్కరించాలని ఈనెల 29న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నామని సీఐటీయూ మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు అన్నారు. మండల కేంద్రంలోని వీవోఏల నిరవధిక సమ్మె శనివారం నాటికి 41వ రోజు చేరుకున్న సమ్మెకు సంఘీభావం తెలిపి వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ అభివృద్ధి పథంలో ముందు నడిపించే వారదులు ఐకెపి వీవోఏలే అని అన్నారు. కానీ వారి శ్రమను గుర్తించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభించడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చెందారు. సంక్షేమ పథకాల అమలుకు ప్ర భుత్వ పాలనకు ఎంతో తోడ్పాటు అందించే దిశలో మహిళా గ్రూపులను సమీకరిం చి వారికి ఆర్థిక అభివృద్ధి చెందినందుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంలో తిరిగి వాటిని కట్టించడం, రికవరీ చేయడంలో ఐకెపి వీవోఏలే అని,41 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తక్షణమే వారి డిమాండ్స్‌ పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని అన్నారు. ఈ నెల 29వ తేదీన హైదరాబాదులో ఇందిరా పార్కు దగ్గర నిర్వహించే భారీ బహి రంగ సభను జయప్రదం చేయాలని వీవోఏలకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో సంఘం మండల అధ్యక్షులు హనుమంతు ఉపేందర్‌, లింగయ్య, నిమ్మకంటి రాధిక, పెరమాల మంజుల, టి.మంజుల, అక్కెర ఉష, శ్రీనివాస్‌, రమేష్‌, శ్వేత, స్వాతి, స్వప్న, హైమా, కవిత, యాకమ్మ, నాసిహత్‌ బేగం, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, ఉమా, సుమతి, లక్ష్మి, రేణుక, చింతకుంట్ల ఉపేందర్‌, బిరు యాకయ్య, వివిధ గ్రా మాల వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.