చంద్రబాబు అరెస్టు బాధాకరం

– తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఖండించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయు డి నాయకత్వంలో మంత్రిగా పని చేసిన తనకు ఈ ఘటన వ్యక్తిగతంగా ఎంతో బాధను కలగించిందని తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.