నవతెలంగాణ మోపాల్: మోపాల్ మండలంలోని మండల కేంద్రంలో గల రైతు వేదికలో మంగళవారం రోజున మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పతకం సామజిక తనికి లో భాగంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సామజిక తనిఖీ సమావేశానికి చందర్ నాయక్ డిఆర్డిఓ పిడి నిజామాబాద్, నారాయణ విజిలెన్స్ అధికారి, శ్రీ బి. లింగం నాయక్ ఎంపీడీవో మోపాల్, ఏపీవో సునీత, సాగర్ మండల కేంద్రంలోని 21 గ్రామపంచాయతీలో గాను క్షుణ్ణంగా ఆడిట్ నిర్వహించడం జరిగింది. అలాగే గ్రామ సెక్రెటరీలకు కొన్ని సూచనలు ఆడిట్ కి సంబంధించిన కొన్ని వివరాలను అడగడం జరిగింది.