జన గర్జన సభను జయప్రదం చేయండి: చెన్నకేశవరావు

నవతెలంగాణ – అశ్వారావుపేట
జులై 2న ఖమ్మం లో జరగబోయే ప్రజా గర్జన సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండల అద్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మం వేదిక జరగబోయే జన గర్జన సభకు ఏఐసిసి అగ్ర నాయకులు రాహుల్ గాంధీ,పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరు అవుతారని తెలిపారు. వీరి సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారు.అని అన్నారు. ఈ సభకు అశ్వారావుపేట నియోజకవర్గం లోని కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని జన గర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జూపల్లి రమేష్, కో – ఆప్షన్ సభ్యులు ఎస్కే పాషా,ఎం.పి.టీ.సీ లు వేముల భారతి, హరిబాబు సత్యవరపు తిరుమల బాలగంగాధర్,అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్య,వైస్ ప్రెసిడెంట్ రేమల్ల కేదార్నాథ్,మాజీ సర్పంచ్ పొట్టా రాజులు, జల్లిపల్లి దేవ రాజ్, జూపల్లి ప్రమోద్,నండ్రు రమేష్ సత్యవరపు బాలయ్య, మేక అమర్నాథ్ లు పాల్గొన్నారు.