అగ్ని ప్రమాద బాధితురాలికి జనసేన చేయూత..

– నియోజక వర్గం బాధ్యులు డేగల నేతృత్వంలో సామాగ్రి అందజేత..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని తాటి నాగుల గుంపు కు చెందిన కుంజా మంగమ్మ గుడిసె విద్యుత్ ఘాతుకానికి గురై ఇల్లు దగ్దం అయింది. బాధితురాలు మంగమ్మ ను జనసేన నియోజక వర్గ ఇంచార్జి డేగల రాము (రామచంద్ర రావు) ఆద్వర్యంలో శనివారం నిత్యవసర సరుకులు దుప్పట్లు బియ్యం అందించారు. అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ..  ప్రభుత్వం వైపు నుండి మీకు ఎలాంటి అన్యాయం జరిగిన మీకు రావాల్సిన నష్టపరిహారం విషయంలో ఏమైనా ఇబ్బందులు కలిగిన జనసేన అండగా ఉంటుందని, మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇస్లావత్ వినోద్ నాయక్,మల్లం రామకృష్ణ జనరల్ సెక్రెటరీ బద్ది రెడ్డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love