
– మరి కొందరు కాంగ్రేస్ వైపు చూస్తున్నారు..
నవతెలంగాణ- చందుర్తి
గత సంవత్సరం నుండి చెన్నామనే రమేష్ పై అసంతృప్తి తో సనుగుల ప్యాక్స్ చైర్మన్ కిషన్ రావు,లింగంపేట ఎంపిటిసి రమేష్,వైస్ ఎంపిపి అబ్రహం లు ఎమ్మెల్యే రమేష్ బాబుకు వ్యతిరేకంగా పని చేస్తూ చెలిమేడను స్థానికంగా హెల్త్ క్యాంపులకు సహకరించారు. దీతో మండలంలో అధికార పార్టీలో గ్రూపులు తయారైనాయి. ఎట్టకేలకు చెలిమెడ లక్ష్మి నర్సింహా రావుకు బిఆరెస్ అధిష్టానం వేములవాడ టికెట్ ఇవ్వడంతో చెన్నామనేని రమేష్ బాబు వర్గంలోని కొందరు ప్రజా ప్రతినిధులు కరీంనగర్ లో లక్ష్మి నర్సింహా రావును మంగళవారం సనుగుల సర్పంచ్ కరుణాకర్ రామారావు పల్లి సర్పంచ్ కమలాకర్ రావు జోగాపూర్ సర్పంచ్ మేకల పరిషరాములు కిష్టంపేట సర్పంచ్ అంబేరినరేష్, నర్సింగాపూర్ సర్పంచ్ గంగాధర్ మల్యాల సర్పంచ్ లక్ష్మీనారాయణ రామన్నపేట సర్పంచ్ దుమ్ము ఆనంద్ ఆయన నివాసం లో కలసి శుభాకాంక్షలు తెలిపారు. మరి కొందరు నేడో, రేపో కలిసే ఆవకాశం ఉన్నట్లుగా ఆయనతో మాట్లాడినట్లుగా సమాచారం.
మరి కొందరు కాంగ్రేస్ వైపు
అధికార పార్టీ కి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది.చెలిమెడ కు వేములవాడ నియోజకవర్గంలో పెద్దగా పట్టు లేక పోవడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అది శ్రీనివాస్ గెలిసే అవకాశం ఉందని అధికార పార్టీ నాయకులు కొందరు చెప్పకనే చెప్పారు.దింతో కొందరు కాంగ్రేస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.