ఘనంగా చత్రపతి శివాజీ యూత్ వినాయకుని నిమజ్జనం

నవ తెలంగాణ- రాజంపేట్: మండలంలోని ఆరేపల్లి గ్రామంలో సోమవారం చత్రపతి శివాజీ యూత్ వినాయకుని నిమర్జనం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి లడ్డు వేలం పాట నిర్వహించగా మాలిస్ కమలాకర్ రావు 10000 కు లడ్డును దక్కించుకున్నారు. ఆయనకు సంఘ సభ్యులు లడ్డును అందజేశారు.