– 100 శాతం స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..
– అడుగంటిన తెలంగాణ భూగర్భ జలాలు నాడు.
– చెక్ డ్యాం ల నిర్మాణంతో బావుల్లో ఊటలు నేడు.
– నీళ్ల ట్యాంకర్ల వద్ద బిందెడు నీటి కోసం ఆడబిడ్డలు ఇక్కట్లు నాడు.
– ఆర్టీసీ చైర్మన్,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ – డిచ్ పల్లి
దేశానికే ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక “మిషన్ భగీరథ” అని, 100 శాతం స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, అడుగంటిన తెలంగాణ భూగర్భ జలాలు నాడు ఉండేదని, చెక్ డ్యాం ల నిర్మాణంతో బావుల్లో ఊటలు నేడు ఉందని, ఎక్కడ చుసిన నీళ్ల ట్యాంకర్ల వద్ద బిందెడు నీటి కోసం ఆడబిడ్డలు ఇక్కట్లు నాడు ఉండేదని, 100 శాతం స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే నని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్ వాయి మండల కేంద్రంలో నీటి శుద్ధి కేంద్రం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మంచినీళ్ల పండగ తాగునీటి విజయాలపై సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గోని మాట్లాడుతూ తెలంగాణ మంచినీళ్ల పండుగ మిషన్ భగీరథ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి తాగునీటి అందించడం కోసం, ఖర్చు చేసిన వివరాలను అంకేలతో సహా వివరించారు. ఇలా డిచ్పల్లి మండలం 52 గ్రామాలకు, 172 కిలోమీటర్ల పైప్ లైన్, 40 కొత్తగా నిర్మించిన ట్యాంక్, మొత్తం బిగించిన నల్లలు 15033, ఖర్చు మొత్తం ఖర్చు 147 కోట్లు. ఇందల్వాయి మండలం 40 గ్రామాలకు, 101 కిలోమీటర్ల పైప్ లైన్, 31 కొత్తగా నిర్మించిన ట్యాంక్, మొత్తం బిగించిన నల్లలు 11496, ఖర్చు మొత్తం ఖర్చు 108 కోట్లు అయిందన్నారు.ధర్పల్లి మండలం 38 గ్రామాలకు, 76 కిలోమీటర్ల పైప్ లైన్, 24 కొత్తగా నిర్మించిన ట్యాంక్, మొత్తం బిగించిన నల్లలు 5848, ఖర్చు మొత్తం ఖర్చు 58 కోట్లు వేచ్చించినట్లు తెలిపారు.సిరికొండ మండలం 70 గ్రామాలకు, 103 కిలోమీటర్ల పైప్ లైన్, 43 కొత్తగా నిర్మించిన ట్యాంక్, మొత్తం బిగించిన నల్లలు 10967, ఖర్చు మొత్తం ఖర్చు 106 కోట్లు అయిందన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం 24 గ్రామాలకు, 38 కిలోమీటర్ల పైప్ లైన్, 6 కొత్తగా నిర్మించిన ట్యాంక్, మొత్తం బిగించిన నల్లలు 3683, ఖర్చు మొత్తం ఖర్చు 35 కోట్లు అయ్యిందని, ఏడు మండలాలకు కలిపి మొత్తం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 612 కోట్లతో పైప్ లైన్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని వివరించారు. మిషన్ భగీరథకు అవార్డులు.. 2019లో మిషన్ భగీరథ పథకానికి నేషనల్ వాటర్ కమిషన్ అవార్డు కింద ప్రథమ బహుమతి లభించిందని, దీనికింద రూ.2 లక్షల నగదు బహుమతి దక్కిందని ఇది సాధించిన విజయమన్నారు. గ్రామీణ ప్రాంతాలకు నల్లా కనెక్షన్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నందుకు జల్ జీవన్ అవార్డ్స్ 2022 కింద ప్రథమ బహుమతి లభించిందని పేర్కొన్నారు. వీటితోపాటు మరెన్నో అవార్డులు, రివార్డులను మిషన్ భగీరథ పథకం దక్కించుకుందని, మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అనే పేరుతో అమలు చేస్తుండటం తెలంగాణకు గర్వకారణ మన్నారు.
చెక్ డ్యాం ల నిర్మాణంత బావుల్లో ఊటలు నేడు !
సమైక్య రాష్ట్రంలో ల్తాగునీటి సమస్యతో దశాబ్దాల పాటు ఇబ్బందులు పడ్డ ప్రజలకు.. స్వరాష్ట్రంలో ‘మిషన్ భగీరథ’తో సీఎం శ్రీ కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపించారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో స్వరాష్ట్రంలో తీరిన తాగునీటి కష్టాలు. దేశంలో 100 % తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛ జలాలు అందుతున్నయీ. తాగునీటి పంపిణీలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రశంస అందించిందన్నారు.నీళ్ల ట్యాంకర్ల వద్ద బిందెడు నీటి కోసం ఆడబిడ్డల సిగపట్లు నాడు. కిలోమీటర్ల దూరం నడిచి వాగులు, వంకల్లో చెలిమలు తవ్వుకొని నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు నాడు, వ్యవసాయ బావుల వద్ద నీటి కోసం భగీరథ యత్నాలు’.. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలు పడిన క‘న్నీటి’ కష్టాలు. మనిషి బతికేందుకు అత్యవసరమైన నీటి సౌలతి కల్పించడంపై నాటి పాలకుల నిర్లక్ష్యంతో నాడు బిందెడు నీటి కోసం అపసోపాలు పడేవారు. నిత్యం సర్పంచులు మా గ్రామాలకు బోర్లు కావాలని అడిగేవారు, తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నీటి కష్టాలు తొలగించేందుకు కంకణం కట్టుకొన్నారు. భవిష్యత్తు తరాలకు నీటి సమస్యలు రాకూడదని పక్కా ప్రణాళికలు రచించారు. మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. పక్కా ప్రణాళికతో ప్రస్తుతం ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు సరఫరా చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది అని తెలిపారు. వివిధ తండాలకు గ్రామ పంచాయతీ భవనం కొరకు ఒక గ్రామ పంచాయతీకి ₹ 20 లక్షల రూపాయలు, ఇవే కాకుండా, ప్రతి తండాలో సీసీ రోడ్ల కోసం మరియు డ్రైనేజీల నిర్మాణం కోసం ₹ 10, పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో 70 దేవాలయాలు నిర్మించుకోవడం జరిగిందని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు.ప్రజలందరికీ, యువకులకు ముఖ్యంగా చదువుకున్న యువతీ యువకులకు ఒకటే తెలియజేస్తున్న, బిజెపి పార్టీ చెప్పే అబద్ధాలను నమ్ముతున్న యువకులు మేలుకోవాలి, మన దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోధీ ₹ 100 లక్షల కోట్లు అప్పులు చేశారు. అప్పు చేసి మరి ఏ గ్రామానికి అయినా రూపాయి ఇచ్చిండా అంటే అది లేదు, అబద్ధ ప్రచారాలు చేసుకోవడం మతాన్ని అడ్డం పెట్టుకొని, ముఖ్యంగా రామున్ని అడ్డం పెట్టుకొని, రావణాసుడులా రాజకీయం చేస్తున్నా బిజెపి పార్టీ, యువతను తప్పుదోవ పట్టిస్తూ మత రాజకీయం చేయడం తప్ప ప్రజలకు చేసింది శూన్య మన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నాడని, వారి దగ్గర ఉన్న వ్యక్తులు 15 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి ప్రభుత్వానికి ఎగబెట్టి వేరే దేశానికి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇలాంటి దుర్మార్గులకు ఇలాంటి బీజేపీ పార్టీకి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, ఇందల్ వాయి మండల అధ్యక్షులు చిలువేరి దాసు , సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు పాశం కుమార్, అరటి రఘు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, పులి వసంత సాగర్, ఎంపిటిసి లు చింతల దాస్,మెరుపుల్ని సుధాకర్, కచ్చకాయల అశ్విని శ్రీనివాస్, తహసిల్దార్ టివి రోజా, ఎంపిడిఓ రాములు నాయక్,వివిధ మండలాలకు చెందిన జడ్పిటిసిలు, ఎంపీపీలు, మండల అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు ఉప సర్పంచ్లు ఎంపీటీసీలు, మిషన్ భగీరథ అధికారులు, తాగునీటి శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు,కరోబార్లు, ఐకెపి సిబ్బంది, వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.