పిల్లలకు భావితరాలకు విలువలు నెర్పించాలి

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
పిల్లలకు భావితరాలకు విలువలు నెర్పించాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ నాగయ్య సార్ అన్నారు. 1997 – 98 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మోస్రా మండలంలోని, మోస్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1997-98 సంవత్సరానికి సంబంధించిన ఉపాధ్యాయ బృందం ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులతో జరిగిన అనుభవాలను పంచుకొని, మంచి సందేశాలను అందిస్తూ, పిల్లలకు భావితరాలకు విలువలు నెర్పించాలని అవే జీవితనికి ములం అని వాటినే అందించాలని అన్నారు. విద్యార్థులు అభివృద్ధి చెందినపుడే ఉపాధ్యాయులు సంతోషిస్తారు అని టిచర్ లు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యయులు నాగయ్య, సూర్య ప్రకాష్ గౌడ్, రవింధర్,‌ గంగపోచయ్య, నాగెంద్రమణి, హన్మండ్లు, 1997-98 పదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.