– అపార అనుభవంతో రేవూరి’
– ప్రతిష్టాత్మకం పరకాల
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల నియోజక వర్గానికి విశిష్ట స్థానం వుంది. పరకాల నియో జకవర్గం 1952 నుండి 1972 వరకు జనరల్ స్థానంగా వుండగా, 1978 నుండి 2004 వరకు ఎస్సీ రిజర్వ్‌డ్‌గా వుంది. 2009 నుండి జనరల్ స్థానంగా మారింది. ఈ నియోజక వర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా ఐదుసార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, ఏడుసార్లు ఎస్సీలు, ఒకసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక య్యారు. పరకాల మున్సిపాల్టీతోపాటు గ్రామీణ మండలం, నడికూడ, ఆత్మకూరు, దామెర, గీసు గొండ, సంగెం మండలాలతో ఈ నియోజక వర్గం విస్త రించి వుంది. 1952లో ఈ నియోజ కవర్గం ఏర్పడింది. 2014లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే గా విజయం సాధించిన చల్లా ధర్మారెడ్డి, 2018 లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సృష్టించాలని తహ తహలాడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గతం లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఈసారి పరకాల బరిలోకి దిగ డంతో పోటీ నువ్వా ? నేనా ? అన్నట్టుగా వుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల నియో జకవర్గానికి పోరాటాల చరిత్ర ఉంది. అటు రజా కార్లను తరిమికొట్టిన నేల ఇది. ఇటు పీపుల్స్ వార్ కార్యకలాపాలకు ఒకప్పు డు పెట్టని కోటగా వున్న ప్రాంతం. తొలుత ఈ నియోజక వర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా వుండేది. ఈ నియో జకవర్గంలో పిడిఎఫ్ ఒకసారి, కాంగ్రెస్ 6 సార్లు, భారతీయ జన్ సంఫ్‌ు, బిజెపిలు కలిసి మూడుసార్లు, టిడిపి రెండుసార్లు, సిపిఐ ఒకసారి, బీఆర్‌ఎస్ రెండుసార్లు ఈ నియోజక వర్గం నుండి గెలు పొందాయి. తాజాగా జరుగు తున్న అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మ కంగా జరుగనున్నాయి. మూడోసారి ఎమ్మెల్యేగా గెలవాలని బీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి మళ్లీ బరిలోకి దిగారు. ప్రచారంలో ముందం జలో ఉన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా ‘రేవూరి’
పరకాల కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పోటీ చేయడం విశేషం. గతంలో మూడుసార్లు నర్సంపేట నియోజ కవర్గం నుండి
ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్‌రెడ్డి గతంలో టిడిపిలో పనిచేశారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపి నుండి బిజెపిలో చేరిన ‘రేవూరి’ తాజాగా కాంగ్రెస్‌లో చేరి అనూహ్యంగా పరకాల కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. పరకాల బరిలో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా రంగంలో వున్న చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ‘రేవూరి’ ఇద్దరి పూర్వరంగం టిడిపినే కావడం గమ నార్హం. అపారమైన రాజకీయ అనుభవం కలిగిన ‘రేవూరి’ పరకాలలో పోటీ చేస్తుండ డంతో పరకాల నియోజకవర్గంలో ఎన్నికలు అ త్యంత ఉత్కంఠ భరితంగా మారనుంది. నర్సంపేటలో 1994 ఎన్నికల్లో ఎంసిపిఐ నేత మద్ది కాయల ఓంకార్‌ను ఓడించి ‘రేవూరి’ సంచలనం సృష్టించిన విషయం విదితమే. 1999, 2009లోనూ ‘రేవూరి’ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
‘హ్యాట్రిక్’ కోసం ‘చల్లా’ తహతహ..
తొలిసారి 2014లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మె ల్యేగా గెలిచిన ‘చల్లా’ అనంతరం టిఆర్‌ఎస్‌లో చేరారు. 20 18లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి కొండా సురేఖపై 46 వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటికే రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ‘చల్లా’ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ముగ్గురు మంత్రులు
పరకాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో పింగిళి ధర్మారెడ్డి, బొచ్చు సమ్మయ్య, కొండా సురేఖ మంత్రి పదవులు పొందారు. పింగిళి ధర్మారెడ్డి జలగం వెంగళరావు కేబినెట్‌లో పనిచేయగా, బొచ్చు సమ్మయ్య భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. కొండా సురేఖ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
నువ్వా..? నేనా..?
పరకాల నియోజకవర్గంలో ఈసారి టిడిపి రాజకీయా లతో ఆరగేట్రం చేసిన చల్లా ధర్మారెడ్డి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా, రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇద్దరి మధ్య ప్రచారం హౌరాహౌరీగా సాగుతుంది. పర కాల నియోజకవర్గంలో ‘చల్లా’కు ధీటైన అభ్యర్థి లేరని మంత్రి కేటీఆర్ బహిరంగసభలోనే ప్రకటించిన నేపథ్యంలో అనూ హ్యంగా కాంగ్రెస్ అభ్యర్థిగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి రంగంలోకి దిగడంతో పోటీ ఉత్కంఠభరితంగా మారుతుంది. ఇద్దరి మధ్య నువ్వా ? నేనా ? అన్న విధంగా మారనుంది. ఇప్పటికే బిఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి వలసలు ప్రారంభం కావడంతో పోటీ రసవత్తరంగా మారుతుంది.