కౌశిక్ రెడ్డి ముదిరాజ్ లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి: చిల్ల నిరంజన్

నవతెలంగాణ-దంతాలపల్లి
జాతికే సేవ చేసే వృత్తి జర్నలిజం లో ఉండి, ఒక ప్రైవేట్ ఛానెల్ లో పనిచేస్తున్న అజయ్ ముదిరాజ్ ను అక్రమంగా బందించి,ముదిరాజ్ జాతిని బూతు పదజాలంతో తిట్టడం అనేది, ముదిరాజ్ లందరిని అవమాన పరిచినట్లే అని, రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న ముదిరాజ్ లను తిడితే యావత్ జాతి చేతులు ముడుచుకొని కూర్చోదని,కౌశిక్ రెడ్డి కి తగిన బుద్ది చెపుతమని మెప మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు చిల్ల నిరంజన్ ముదిరాజ్ ఈ విషయాన్ని శుక్రవారం దంతాలపల్లి మండల కేంద్రంలో ఖండిస్తూ నట్లు ఆయన తెలిపారు.మెపా రాష్ట్ర, కమిటీ పిలుపుమేరకు జిల్లా, డివిజన్, మండల,గ్రామ కమిటీ సభ్యులు అందరూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని (మెపా) ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు చిల్ల నిరంజన్ ముదిరాజ్ అన్నారు.