కాంతారావు తెలుగువారి జ్ఞాపకాలలో చిరంజీవి జస్టిస్‌ గ్రంధి భవానీ ప్రసాద్‌

నవతెలంగాణ-కల్చరల్‌
పౌరాణిక సాంఘీక జానపద చిత్రాలలో కథానాయకునిగా అగ్ర నటులు ఎన్‌.టీ.ఆర్‌, ఏ. ఎన్‌.ఆర్‌ తో సమంగా నటించిన కాంతారావు తెలుగు వారి జ్ఞాపకాలతో చిరంజీవి అని ఉమ్మ్డఇ ఆంద్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గ్రంధి భవానీ ప్రసాద్‌ కొనియాడారు. శ్రీ త్యాగరాయ గాన సభ ప్రధాన వేదిక పై యువ కళా వాహిని, సుమధుర ఆర్ట్స్‌ అకాడమీ సంయుక్తంగా విఖ్యాత నటుడు కాంతారావు శత జయంతి సభ జరిగింది. ముఖ్య అతిథిగా జస్టిస్‌ భవానీ ప్రసాద్‌ పాల్గోని బుల్లి తెర నటుడు అశోక్‌ కుమార్‌ కు కాంతారావు అభినయ ప్రతిభ పురస్కారం, సినీ నటుడు సి.వీ. ఎల్‌. నర సింహారావుకు కాంతారావు ఆప్తమిత్ర పురస్కార ప్రదానోత్సవం చేసి మాట్లాడారు. కాంతారావు నారద పాత్ర కు మారు పేరు అన్నారు. అధ్యక్షత వహించిన కళా పోషకుడు సారిపల్లి కొండలరావు మాట్లాడుతూ తమ సంస్థ యువకళావాహిని గతంలో కాంతారావు ను సత్కరించి న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.జర్నలిస్ట్‌ రెంటాల జయదేవ్‌ మాట్లాడుతూ అవార్డ్‌ గ్రహీత అశోక్‌ కుమార్‌ బుల్లి తెర నారదునిగా కాంత రావును గుర్తు చేస్తారన్నారు. సి.వీ.ఎల్‌ నటుడిగా నే కాకుండా సమస్యల సై ఉద్యమించే నాయకుడు అని వివ రించారు. దూర్‌ దర్శన్‌ విశ్రాంత సంచాలకుడు డాక్టర్‌ పీ. మధుసూదన రావు మాట్లాడుతూ ప్రభుత్వంతో సంబంధం లేకుండా కొండలరావు కాంతారావు శత జయంతి చేయటం ఆయన సహదయత సందర్భంగా అను సోదరిణులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.