ఘనంగా చొక్కారావు వర్ధంతి వేడుకలు

నవతెలంగాణ-మహాదేవపూర్‌
మమాదేవపూర్‌ మండలం కాళేశ్వరం గ్రామంలోని కాలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణం లో ఆదివారం చొక్కరావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భూపాలపల్లి జెడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీ హర్షిని రాకేష్‌ హౄజరై చొక్కా రావు విగ్రహానిక పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాళేశ్వరం అభివృద్ధికి చొక్కరావు కృషి చేశారని అన్నారు. పుట్ట మధుకర్‌ సహకా రంతో నిధులు తెచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతామని అన్నారు. ఈ కార్యక్ర మంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన నాయకులు జక్కు రాకేష్‌ కాళేశ్వరం దేవస్థానం చైర్మన్‌ లింగంపల్లి శ్రీనివాసరావు, కాళేశ్వరం ఎంపీటీసీ రేవెల్లి మమత నాగరాజు, సర్పంచ్‌ వసంత మోహన్‌ రెడ్డి, బి ఆర్‌ ఎస్‌ పార్టీ నియోజకవర్గం మహిళ అధ్యక్షురాలు కేదారి గీత, ఆలయ ఈఓ మహేష్‌, డైరెక్టర్లు కుంభం పద్మ, కలికోట దేవేందర్‌, అడప సమ్మయ్య, కామిడీ రాంరెడ్డి, రాజయ్య, దేవుడా శ్యాంసుందర్‌, ప్రశాంత్‌ రెడ్డి, రాజయ్య, మండల సోషల్‌ మీడియా మండల ఇంఛార్జి దబ్బెట రవీందర్‌,పలుగుల సర్పంచి మానెమ్‌ లస్మయ్య మరియు గ్రామ శాఖ అధ్యక్షులు బర్ల కుమార్‌, ఉపాధ్యక్షులు మచ్చ రాజయ్య. మరియు సీనియర్‌ నాయకులు పూతల శ్యామ్‌ అదేవిధంగా వార్డ్‌ మెంబర్స్‌ మచ్చ రాజేష్‌, నిట్టూరి శంకరయ్య. నిట్టూరి రాజబాబు, మంద బానేష్‌. మరియు సోషల్‌ మీడియా ఇన్ఛార్జ్‌ నిట్టూరి సంతోష్‌ మహాదేవపూర్‌ ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు నిట్టూరి రమేష్‌ పాల్గొన్నారు.