
మండల కేంద్రంలోని విద్యా వనల కేంద్రం గత వారం రోజులుగా తాళానికే పరిమితం అవుతుంది. తమ డిమాండ్ల నెరవేరన కోసం గత వారం రోజులుగా సిఆర్పిఎస్ సిబ్బంది సమ్మె చేయడంతో కార్యాలయం కార్యకలాపాలు కొనసాగక తాళానికి పరిమితం అయింది. కార్యాలయం సమీపంలో ఎవరు లేకపోవడంతో కార్యాలయ ఆవరణలో చీమలు తమ నివాసానికి గోడును ఏర్పాటు చేసుకుంటున్నాయి. విద్యా వనరుల కార్యాలయం కాస్త మూగజీవాలకు నిలయంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని అటువైపుగా వెళ్తున్న వారు ఆరోపిస్తున్నారు. కార్యాలయ సమూహంలో రెండు చీమలు తమ నివాసాల కోసం పుట్టలను ఏర్పాటు చేసిన దర్శనమిస్తున్నాయి. విద్యా వ్యవస్థ పటిష్టం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నామని అంటున్నప్పటికీ విద్యారంగంలోని సిబ్బంది సమస్యలు పరిష్కరించకపోవడం విద్యార్థులకు సరైన విద్య అందడం అందలంగానే మారుతుందని సి ఆర్ పి ఎస్ సిబ్బంది ఆరోపిస్తున్నారు .