నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనావర్ ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయరాం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ నరహరి రెండవ పట్టణ ఎస్ఐ అశోక్, మూడవ పట్టణ ఎస్సై ప్రవీణ్ కుమార్, నాలుగో పట్టణ ఎస్సై సంజీవ్ లు డీజే యజమానులను పిలిపించి ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున పట్టణంలో పోలీసు వారి ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలలో, ఇతర కార్యక్రమంలో డీజేలు పెట్టకూడదని, ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘించిన వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని డీజే యజమానులను స్థానిక తహసీల్దారుల ఎదుట హాజరు పరిచి బైండోవర్ శుక్రవారం చేయడంం జరిగిందని పట్టణ సీఐ నరహరిి తెలియజేశారు. ఎవరైనా డీజే లు పెట్టినట్టయితే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా వాటిని చట్ట ప్రకారం సీజ్ చేసి కోర్టు యందు ఉంచడం జరుగుతుంది. కావున డీజే యజమానులు ఎవరు కూడా పోలీసు వారి ముందస్తు అనుమతి లేకుండా డీజే లు పెట్టకూడదని కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పట్టణ సిఐ నరహరితో పాటుగా రెండవ, మూడవ, నాల్గవ పట్టణ ఎస్ఐలు అశోక్ ప్రవీణ్ సంజీవ్, డీజే యజమానులు పాల్గొన్నారు.