పదకొండు మంది పేకాట రాయుళ్ల పట్టివేత, కేసు నమోదు: సీఐ రామన్

నవతెలంగాణ- గాంధారి
పదకొండు మంది పేకాట రాయుళ్ల పట్టివేత, కేసు నమోదు52,770/- నగదు ఆరు మోటార్ సైకిళ్ళు, 10 మొబైల్ ఫోన్ల స్వాధీనంఅసాంగిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదు.. సీఐ రామన్ గాంధారి మండలం  తిప్పారం గ్రామ శివారులో గల వాగు వద్ద పేకాట ఆడుతూ పట్టుబడిన పదకొండు మంది వ్యక్తుల పైన కేసు నమోదు చేసి వారి వద్ద నుండి పేక ముక్కలు, రూ.52,770  ల నగదును సీజ్ చేయడం జరిగిందని  సదాశివనగర్ సీఐ రామన్ తెలిపారు. శుక్రవారం రాత్రి తిప్పారం గ్రామ శివారు లోని వాగు వద్ద పేకాట ఆడుతున్న సమాచారం రావడంతో  సదాశివనగర్ సీఐ రామన్, కామారెడ్డి ఎస్బి ఇన్స్పెక్టర్ సంతోష్ ల అధ్వర్యంలో దాడులు నిర్వహించగా గాంధారికి మండలానికి చెందిన పదకొండు మంది పేకాట అడుతు పట్టుబడగా వారి వద్ద నుండి నగదు తో పాటు ఆరు మోటార్ సైకిళ్ళు, పది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది అని సీఐ రామన్ తెలిపారు. మండలంలో ఎక్కడ పేకాట ఆడినా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని అన్నారు. పేకాట, గంజాయి, భహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఎవరు చేసినా ఉపేక్షించబోమని సీఐ తెలిపారు. మండలంలో ఎక్కడైనా, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే డయల్100ద్వారా గాని, 8712686165 నెంబర్ ద్వారాగానిగాంధారి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చినవారివివరాలుగోప్యంగా ఉంచడం జరుగుతుంది అని ఆయన అన్నారు.