
ఆమనగల్ పోలీస్ స్టేషన్ లో గత 40 సంవత్సరాలుగా స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్న రాములు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న ఆమనగల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్, ఎస్ఐ బాల్ రామ్ గురువారం పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి రాములు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అదేవిధంగా పోలీసులు అందరు కలిసి రూ.45 వేలు ఆర్థికసాయాన్ని రాములు కు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు. ఈకార్యక్రమంలో సిబ్బంది లక్ష్మణ్, శివకుమార్, శ్రీశైలం, ప్రతాప్, పుష్పలత, ప్రభాకర్, శ్రీశైలం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.