– 123 మంది సాక్షులను వాంగ్ములం తీసుకున్నారు.
– చార్జి స్ట్రీట్ లో 143 పత్రాలు మూడు రిపోర్టులను కోర్టుకు సమర్పించారు.
నవ తెలంగాణ – బోధన్ టౌన్
ఎట్టకేలకు తేల్చిన సీబీఐ గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోధన్ కుంభకోణంలో శివరాజ్ ముఠా దోచుకున్న సొమ్ము లెక్కను సీఐడీ అధికారులు తేల్చారు. బోధన్ కమర్షియల్ టాక్స్ స్కాం కేసు సిఐడి 2012లో దాఖలు చేసిన సిఐడి మంగళవారం సిబిఐ కోర్టులో విచారణ జరిగింది.123 మంది సాక్షులను వాంగ్ములం తీసుకున్నారు. చార్జి స్ట్రీట్ లో 143 పత్రాలు మూడు రిపోర్టులను సిబిఐ కోర్టుకు సమర్పించారు. 35 మందిని విచారించగా మొదట్లో దాదాపు రూ.500 కోట్ల వరకు కొల్లగొట్టారని భావించినా సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన అనంతరం ఆ మొత్తం రూ.280 కోట్లుగా తేలింది. అయితే శివరాజ్ ముఠా 2012 నుంచి 2017 వరకు ఐదేళ్ల పాటు దోపిడీకి పాల్పడితే.. ఈ కేసు దర్యాప్తునకూ సీఐడీకి పదేళ్లు పట్టడం గమనార్హం. బోధన్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం కేంద్రంగా శివరాజ్ ముఠా చేసిన దోపిడీ మొత్తం ఇది. ప్రభుత్వ సిబ్బందితో కలిసి ఆ ముఠా ఖజానాకు కన్నం వేసినట్లు నిర్ధారణ అయినప్పటికీ ప్రభుత్వానికి జరిగిన నష్టం ఎంత? అనేది ఇంతకాలం చిక్కుముడిగానే మిగిలింది. రూ.500 కోట్ల వరకూ ఉండవచ్చని మొదట్లో భావించినప్పటికీ సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చింది.