ఊహాజనిత కథనాలను ప్రసారం చేస్తున్నారు..

– వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తనకూ తెలంగాణ ప్రజలకు మధ్య దూరం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఊహాజనిత కథనాలను ప్రసారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆమె వాపోయారు. తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగానే ఉంటానని తెలిపారు. ఇక్కడి ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు.తనపై వార్తలు రాసేవారు..కేసీఆర్‌ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన వైఫల్యాల గురించి కూడా రాయాలని సూచించారు.