గ్రీస్‌ కార్మికలోకానికి సిఐటియు అభినందనలు

న్యూఢిల్లీ : గ్రీస్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో అక్కడి కమ్యూనిస్టు పార్టీ (కెకెఇ)కి ఓటు వేసినందుకు ఆ దేశ కార్మిక లోకానికి సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సిఐటియు) అభినందనలు తెలిపింది. ఈ నెల 25న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ 7.7 శాతం ఓట్లతో 20 ఎంపి స్థానాలను గెలుచుకుంది. రద్దయిన గత పార్లమెంట్‌లో కెకెఇ కి 15 మంది ఎంపీిలు ఉన్నారు. ఎలాంటి పొత్తులు లేకుండా తాజా ఎన్నికల్లో కెకెఇ స్వతంత్రంగా పోటీ చేసింది. గ్రీక్‌ పార్లమెంట్‌లో మొత్తం స్థానాలు 300 కాగా, భారత పార్లమెంట్‌లో మొత్తం 543 స్థానాలు ఉన్నాయి. ఈ నిష్పత్తి ప్రకారం చూసుకుంటే భారత్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు పార్టీకి 36 స్థానాలు ఉన్నట్లు అని సిఐటియు తెలిపింది.