యాదానాయక్‌ తల్లి మృతికి సీఐటీయూ సంతాపం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదానాయక్‌ తల్లి కురుసోత్‌(81) మృతికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ మేరకు శనివారం ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కురుసోత్‌కు ఇద్దరు కుమారులు, తొమ్మిది మంది మనుమలు, మనుమరాండ్ల్రు ఉన్నారు.