ఆశా లకు నిర్ధిష్ట వేతనం చెల్లించాలి – సిఐటియు

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆశా వర్కర్ల కు నిర్వహించే పరీక్షలను వెంటనే రద్దు చేయాలని, పారితోషికాలు ను రూ .18 వేలకు పెంచి నిర్దిష్ట వేతనం నిర్ణయించాలని కోరుతూ సమస్యలు తో కూడిన వినతిపత్రాన్ని వినాయక పురం,గుమ్మడివల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వైద్యాధికారులు కు సోమవారం ఆశా వర్కర్లు యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అందజేశారు.ఈ సందర్భంగా ఆశా వర్కర్లు యూనియన్ నాయకులు భారతి,సమత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గిరిజన ప్రాంతంలో గత 32 సంవత్సరాలు గా,మైదాన ప్రాంతంలో 18 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారునీ, ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించే అనేక ట్రైనింగ్ పొందారనీ,రిజిస్టర్లు రాయడం,సర్వేలు చేయడం, ఆన్లైన్ పనిచేయడం,బీపీ షుగర్ థైరాయిడ్ తదితర అన్ని రకాల జబ్బులను గుర్తిస్తున్నారన్నారు.ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందజేస్తున్నారనీ, తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ప్రజలను వివరిస్తున్నారనీ, వీటితోపాటు గర్భిణి బాలింతలు చిన్నపిల్లలకు ఇతర ప్రజలకు సేవలు అందిస్తున్నారనీ. కరోనా మహమ్మారి కాలంలో కరోనా నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించారనీ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ గ్లోబల్ లీడర్స్ అని ఆశ వర్కర్లకు అవార్డులను కూడా ప్రకటించిందనీ గుర్తు చేశారు. ఇన్ని పనులు నిర్వహిస్తూ ఇంత అనుభవం ఉన్న ఆశా వర్కర్లకు కొత్తగా పరీక్ష నిర్వహిస్తామని, అందులో ఉత్తీర్ణత సాధిస్తేనే ఆశా వర్కర్లు గా దృవీకరిస్తామని, పరీక్షలో ప్రతిభ కనబరిచన ఆశాల ను విధుల నుండి తొలగిస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమ్నారు.ఇది కించపరచడం తో పాటు ఆశాల సీనియార్టీని తగ్గించి ఉద్యోగ భద్రత లేకుండా చేయడం తప్ప మరొకటి కాదన్నారు.ఆశాలకు నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు. పారితోషికాలు లేని అనేక పనులు ప్రభుత్వం ఆశలతో చేయిస్తున్నదను, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సబ్ సెంటర్ బస్తీ దవాఖానాల్లో పనిచేయాలని ఆశాలకు ప్రభుత్వం చెప్తున్నదనీ. ఇంత పని చేస్తున్న ఆశలకు కేవలం 9, 750 రూపాయలు మాత్రమే పారితోషకాలు ప్రభుత్వం చెల్లిస్తున్నది ఒకవైపు పని భారం పెరిగింది మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలను ఆకాశాన్ని అంటుకున్న ఈ పరిస్థితుల్లో వచ్చే పారితోషికాలు సరిపోక ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులు గురవుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.ఆశా ల పారితోషికాలు రూ. 18 వేలకు పెంచి ఫిక్షుడు వేతనం నిర్ణయించాలనీ రాష్ట్రవ్యాప్తంగా ఆశ వర్కర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దశల వారీగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12 వ తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఆ రోజు విధిగా ధర్నా లో వేలాది గా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు గిన్నె నాగమణి, వాణి, శాంతి, రమాదేవి, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు